తెలుగు లో బింబిసార, భీమ్లా నాయక్, సార్ చిత్రాలతో పాటు విరూపాక్ష చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్( Samyuktha Menon ).ఈ అమ్మడు చేసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడికి లక్కీ బ్యూటీ అనే పేరు దక్కింది.
హీరోయిన్ గా ఈ అమ్మడికి దక్కిన క్రెడిట్ తో చాలా ఆఫర్లు వచ్చాయి.కానీ ఈమె చేస్తున్న సినిమాలు చాలా చాలా తక్కువ అని చెప్పాలి.
ఎందుకు ఈమె చాలా తక్కువ సినిమాలు చేస్తుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈమె భారీ పారితోషికం డిమాండ్( Remuneration ) చేయడంతో పాటు పాత్ర ల విషయం లో కథల విషయం లో ఎక్కువ ఆశలు పెట్టుకుందట.అంతే కాకుండా ఈమె ప్రతి విషయం లో కూడా ఇన్వాల్వ్ అవుతూ దర్శకులకు చిరాకు తెప్పిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.ఆ విషయం లో క్లారిటీ లేదు… అవి కేవలం పుకార్లే అయి ఉండవచ్చు.
కానీ ఎందుకు సంయుక్త మీనన్ కొత్త సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రావడం లేదు అనేది పెద్ద ప్రశ్న.ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి నుండి వస్తుందా అంటూ ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లక్కీ బ్యూటీగా, గోల్డెన్ లెగ్ బ్యూటీగా( Golden Leg Beauty ) మంచి పేరును సొంతం చేసుకున్న ఈ అమ్మడికి ముందు ముందు అయినా మంచి ఆఫర్లు వస్తాయని ఆశిద్దాం.ఆ ఆఫర్లను ఈమె కమిట్ అయ్యి మళ్లీ బ్యాక్ టు బ్యాక్ భారీ గా హిట్ సినిమాలను దక్కించుకుంటుందని ఆశిద్దాం.హీరోయిన్ గా సంయుక్త మీనన్ కి ప్రస్తుతం చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.వాటిల్లో ఎన్ని సినిమా లు ఫైనల్ అవుతాయి అనేది క్లారిటీ లేదు.