అధిక కొలెస్ట్రాల్( Cholesterol ) మన ఆరోగ్యానికి ఎప్పుడు చెడు చేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది.
ఇది అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.అలాగే మంచి కొలెస్ట్రాల్ సహాయంతో శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడతాయి.
అయితే చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.ఈ పరిస్థితి లక్షణాలు సాధారణంగా బయటకు కనిపించవు.
ఇది లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష( Lipid profile test ) ద్వారా గుర్తించబడుతుంది.

కానీ శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పి ఉంటే కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి.దీని కారణంగా రక్తం గుండెకు చేరుకోవడానికి చాలా రకాల అడ్డంకులు ఏర్పడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ సందర్భంలో గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ అవయవాలలో నొప్పి వస్తే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు తొడలు మరియు దిగువ కాళ్ల కండరాల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది.

ఇది తిమ్మిరి కి కూడా కారణమయ్యే అవకాశం ఉంది.ధమానులలో అడ్డుపడడం వల్ల గుండెకే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా రక్తాన్ని తీసుకెళ్లడం కష్టమవుతుంది.ముఖ్యంగా పాదాలలో రక్తప్రసరణ( blood Circulation )సరిగ్గా జరగదు.
ఈ అవయవాలలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల నొప్పి ఏర్పడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్యను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని కూడా అంటారు.
ఈ సమస్య అధికమైతే సాధారణ శారీరక శ్రమలు మరియు మెట్లు ఎక్కడం అసాధ్యం అనిపిస్తుంది.ఈ స్థితిలో కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయాలి.
మన శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే పాదాలు మరియు అరికాళ్ళలో తీవ్రమైన నొప్పి, కాళ్ల తిమ్మిరి, పాదాలు చల్లబడడం, కాలి గోళ్లు పసుపు రంగులోకి మారడం, కాళ్ళ వాపు, కాళ్లలో బలహీనత, పాదాల చర్మం రంగు మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.