పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.ఈ క్రమంలో దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
పాలేరు ప్రజల ఓట్లను కాంట్రాక్టుల కోసం కేసీఆర్ కు అమ్మేసిన వ్యక్తి కందాల ఉపేందర్ రెడ్డి అని ఆరోపించారు.కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ను ప్రస్తుతం ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.