హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) గురించి మనందరికీ తెలిసిందే.ఆమె స్వతహాగా డాక్టర్ అయినప్పటికీ సినిమాలపై నటనపై ఉన్న మక్కువతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.కాగా సాయి పల్లవి కెరియర్ ను మలుపు తిప్పింది మాత్రం ప్రేమమ్ సినిమా( Premam Movie ) అని చెప్పవచ్చు.
అంతేకాకుండా సాయిపల్లవి కెరీర్‌లో మరచిపోలేని చిత్రం ప్రేమమ్.ఆ చిత్రం లేకపోతే ఈమె లేరనే చెప్పవచ్చు.
సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.సాయిపల్లవి చేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి.
అందుకే సాయి పల్లవి ని చూడగానే మన పక్కింటి అమ్మాయి అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.సినిమాల విషయంలో పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగేస్తూ ఉంటుంది.
తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు.అలా సాయి పల్లవి కూడా తన కెరియర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు తిరస్కరించింది.అయితే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు అన్నీ కూడా చాలా వరకు ఫ్లాప్ గా నిలిచాయి.మరి సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాల విషయానికొస్తే.
ఇటీవల చిరంజీవితో భోళా శంకర్( Bhola Shankar ) చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయిపల్లవి ఈజీగా తిరస్కరించింది.తీరా చూస్తే ఆ చిత్రం విడుదలై బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.
అంతకు ముందు కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) సరసన నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చినా కూడా,అందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉండడంతో అందులో నటించనన్నారట.ఆ తరువాత ఆ పాత్రలో రష్మిక నటించారు.
ఆ చిత్రం నిరాశపరచింది.ఇక తమిళంలో అజిత్ సరసన వలిమై చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టినా, పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పిందట సాయి పల్లవి.
ఇటీవల నటుడు విజయ్‌కు జంటగా లియో( Leo ) చిత్రంలోనూ నాయకిగా సాయిపల్లవిని నటింపచేసే ప్రయత్నం జరిగింది.అందులోని పాత్రలో నటనకు అవకాశం లేదంటూ వద్దన్నారు.ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టినా విమర్శలను ఎదుర్కొంది.ఇక చంద్రముఖి–2 నటి కంగనా రనౌత్ పోషించిన పాత్రలో ముందు సాయి పల్లవిని సంప్రదించారు.ఆ కథ నచ్చకపోవడంతో సారీ చెప్పేశారు.ఆ చిత్రం ప్లాప్ అయ్యింది.
ఇలా సాయిపల్లవి రిజెక్ట్ చేస్తే ఇక అంతే అనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది.కాగా ప్రస్తుతం కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్( Sivakarthikeyan ) సరసన సాయిపల్లవి నటిస్తున్నారు.