మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన సుమ కనకాల 'జయమ్మ పంచాయితీ' చిత్రం ఫస్ట్ లుక్‌

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు.విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.

 Ram Charan Released The First Look Poster Of Suma Kanakalas Jayamma Panchayathi-TeluguStop.com

జయమ్మ పంచాయితీ అంటూ రాబోతోన్న ఈ సినిమాలో సుమ కనకాల ఎంతో ఇంటెన్సిటితో కనిపిస్తున్నారు.పాత కాలంలో మాదిరి రోలు, రోకలి పట్టుకుని సుమ కనిపిస్తున్నారు.సుమ ఎంతో కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.సుమ రోకలి దెబ్బకు పగళ్లు రావ‌డం కూడా ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు.

ఇక ఆమె కొంగును చూస్తే.గ్రామీణ వాతావరణానికి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి.ఇందులో సుమ ఊరి పెద్దలా నటిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఫస్ట్ లుక్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు.ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ తుది ద‌శ‌లో ఉంది.త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు నిర్మాత‌లు.

నటీనటులు: సుమ కనకాల

సాంకేతిక బృందం

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : విజయ్ కుమార్ కలివారపు, సంగీతం: ఎంఎం కీరవాణి, డీఓపీ: అనుష్ కుమార్, ఎడిటర్: రవితేజ గిరిజాల, నిర్మాత: బలగ ప్రకాష్, సమర్ఫణ: శ్రీమతి విజయ లక్ష్మీ, బ్యానర్: వెన్నెల క్రియేషన్స్, ఆర్ట్: ధను అంధ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్-అఖిల, పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచర్ల, కాస్ట్యూమ్స్ : హరి ప్రియ, పీఆర్వో : వంశీ-శేఖర్, డిజిటర్ పీఆర్వో : మనోజ్ వల్లూరి, డిజిటల్ ప్రమోషన్స్: హ్యాష్ ట్యాగ్ మీడియా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube