కరోనా వైరస్ చైనా దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ లో వివాదాస్పద నటిగా పేరుపొందిన రాఖీ సావంత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
తాను కరోనా వైరస్ ను అంతమొందిస్తానని ప్రధాని మోదీ తనకు చైనాకు పంపించారని చెబుతూ రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్లు చేశారు.మోదీ వైరస్ ను అంతమొందించటానికి ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్ లో పంపించారని రాఖీ అన్నారు.
నాసా వాళ్లు కరోనా వైరస్ కోసం ప్రత్యేకమైన మందులను తయారు చేశారని ఆ మందులను నేను వారికి ఇచ్చానని కరోనాను చైనాలో అంతమొందించేశానని చెప్పారు.చైనా నుండి భారత్ కు విమానాలను రద్దు చేశారని అందువలన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ద్వారా భారత్ రావాలని అనుకుంటున్నానని రాఖీ సావంత్ అన్నారు.
కరోనా వైరస్ ను భారత్ కు వచ్చే సమయంలో ఒక డబ్బాలో నింపుకొని వస్తానని చెప్పారు.
భారతదేశంలో నిర్భయ దోషులకు, రేపిస్టులకు కరోనా వైరస్ సోకే విధంగా చేస్తానని రాఖీ సావంత్ అన్నారు.తీహార్ జైలులో తాను తీసుకొచ్చిన కరోనా వైరస్ డబ్బాను తెరుస్తానని వాళ్లకు ఉరిశిక్ష పడటం లేదని రాఖీ సావంత్ అన్నారు.రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్లు రాఖీ సావంత్ కు పిచ్చి పట్టిందని అందువలనే పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.