డిమానిటైజేషన్ దేశంలోని బిలియనీర్స్ ను మాత్రమే బాగుపరిచింది: రాహుల్ గాంధీ

నెక్స్ట్ ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ వరుసగా బిజేపి ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.తాజాగా భారత ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన డిమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ పూర్తిగా దెబ్బతిందని.

 Rahul Sensational Statement On Bjp, Rahul Gandhi, Money Transfer, Demonization,-TeluguStop.com

ఈ ప్రక్రియ ద్వారా దేశంలోని బిలియనీయర్స్ మాత్రమే బాగుపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు.

అసలు ఈ డిమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా రైతులు,కూలీలు,కార్మికులు,చిన్న దుకాణం యజమానులు ఏ ప్రయోజనాలు పొందారో కేంద్ర ప్రభుత్వం చెప్పగలదా అంటూ ప్రశ్నించారు.

ప్రధానమంత్రి చెప్పిన క్యాష్ లెస్ ఇండియా ద్వారా అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎలా నాశనమైందో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని ఆయన ప్రభుత్వం పై చురుకలు విసిరారు.

జీడిపి కరోనా మొదలవ్వక ముందు నుంచే దిగజారుతూ వచ్చిందని దీనికి కారణమేంటో బిజేపి చెప్పగలదా అంటూ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

గతంలో రాహుల్ గాంధీ డిమానిటైజేషన్ పై అడిగిన ప్రశ్నలకు ప్రస్తుతం దేశంలో పన్ను ఎగవేతదారులు తగ్గారని దేశప్రజలు ఆన్ లైన్ చెల్లింపులు చేయడం ద్వారా మని ట్రాన్సాక్షన్స్ పై పారదర్శకత పెరుగుతుందని అందుకే తాము ఆన్ లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తూ క్యాష్ లెస్ ఇండియా వైపు వెళ్ళతునట్లు బిజేపి చెప్పింది.

అయినప్పటికీ రాహుల్ మరోమారు డిమానిటైజేషన్ పై ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో బిజేపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube