దేశంలోనే ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది.బ్యాంక్ ఉద్యోగుల కోసం స్వచ్ఛందంగా పదవీ విరమణ పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ స్కీం ద్వారా మానవ వనరులు, వ్యయాలను సమర్థవంతంగా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.బ్యాంకులో పాతికేళ్ల వరకు సర్వీస్ ఉండి 55 ఏళ్లు నిండి ఉద్యోగులు ఈ పథకానికి అర్హులని తెలిపింది.
ఈ స్కీం డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి చివరి వరకు ప్రతి ఏడాది మూడు నెలల పాటు స్కీం అమలులో ఉంటుందని ఎస్ బీఐ వెల్లడించింది.
ఈ మేరకు ఖర్చుల తగ్గింపులో భాగంగా బ్యాంక్ సీనియర్ ఉద్యోగులకు వీఆర్ఎస్ అందిస్తోంది.
కొత్త వీఆర్ఎస్ ప్రణాళిక ద్వారా ఇప్పటివరకూ మొత్తంగా 11,565 మంది అధికారులు, 18,625 సిబ్బంది ఉన్నారు.ఈ సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీంను ఎంచుకున్న వారి జీతంలో 50 శాతం వరకు భవిష్యత్ సేవా కాలానికి చెల్లించనున్నారు.అర్హత కలిగిన వారు 30 శాతం వరకు ఈ పథకాన్ని ఎంచుకున్నా రూ.2,170.85 కోట్ల సేవింగ్ చేయోచ్చని బ్యాంక్ భావిస్తోంది.దీనిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని కార్యచరణ మొదలు పెట్టింది.మార్చి 2020 నాటికి ఎస్ బీఐలో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.