వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ ల మీద లెటర్లు రాస్తున్నారు.ఇప్పటికే దాదాపు ఐదు లెటర్ లు వరకు రాయటం జరిగింది.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అదే రీతిలో ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో.అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్లు కొన్ని అంశాలను లేవనెత్తి వాటిని వెంటనే నెరవేర్చాలని రఘురామకృష్ణంరాజు లెటర్లు మొన్నటి వరకు రాశారు.
అయితే తాజాగా శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లేఖ రాయడం జరిగింది.

గతంలో ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో శాసనమండలిని రద్దు చేయాలని అప్పుడు వైయస్ జగన్ అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశ పెట్టడం తెలిసిందే.ఆ సందర్భాన్ని తాజాగా గుర్తుచేస్తూ ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో మండలిని రద్దు చేస్తే ప్రజలకు పార్టీపై చిత్తశుద్ధి పెరుగుతుందని.శాసన మండలి రద్దు కోసం తీర్మానం చేయాలని.
అలా చేయటంవల్ల గౌరవం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.అంతేకాకుండా గతంలో శాసనమండలి కొనసాగించటం అనేది పెద్ద దండగ అన్నట్లు జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను తాజాగా గుర్తు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే శాసన మండలి రద్దు కు అవసరమైతే పార్లమెంటులో తాను కూడా పోరాడటానికి రెడీగా ఉన్నట్లు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.