తెలంగాణ రాజకీయాల్లో మరో కోణం బయటకు వచ్చింది.ఇప్పటికే ఈటల చుట్టు ఉచ్చు బిగించాలని శతవిధాల ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఊహించని విధంగా మంథని లాయర్ దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెరపైకి వచ్చారు.
ఇకపోతే వామన్ రావు తండ్రి కిషన్ రావు తన కొడుకు, కోడలు హత్య కేసులో పుట్ట మధును విచారించాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధును విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.ఇదే సమయంలో విచారణకు అని వచ్చిన మధు అక్కడి నుంచి గన్‌మెన్లు, డ్రైవర్‌కు చెప్పకుండా తప్పించుకున్న విషయం తెలిసిందే.
అలా తప్పించుకున్న మధు మహారాష్ట్రకు వెళ్లి, అక్కడి నుండి చత్తీస్‌ఘర్, ఆ తర్వాత ఒడిశా మీదుగా ఏపీకి చేరుకున్నాడట.అలా ఏపీకి వచ్చిన మధు భీమవరంలోని చేపల చెరువు దగ్గర మకాం వేసినట్లుగా పోలీసుల విచారణలో తెలిపారట.
ఇక ఎందుకు పారిపోవలసి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పారిపోయానని మధు పోలీసుల విచారణలో వెల్లడించాడట.మరి ఈ వ్యవహారం ఇంకెందరి మెడకు చుట్టుకుంటుందో, చివరికి ఎక్కడి వరకు వెళ్లుతుందో చూడాలి.