'రాధేశ్యామ్‌' కోసం విదేశాల్లో ఒక భారీ ఈవెంట్ కు ప్లాన్‌

ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ లో రూపొందిన రాధే శ్యామ్‌ సినిమా సంక్రాంతికి రావడం దాదాపుగా కన్ఫర్మ్‌ అంటున్నారు.ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల తేదీ సంక్రాంతికి అంటూ ప్రకటించినా కూడా రాధే శ్యామ్ మాత్రం అదే తేదీని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి.

 Prabhas Pooja Hegde Movie Radeshyam Promotions Update , Movie News, Pooja Hegde-TeluguStop.com

ఒక వేళ ఆ తేదీ తప్పిస్తే మళ్లీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.అందుకే సంక్రాంతికే విడుదల చేయలనే ఉద్దేశ్యంతో ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నారు.

విడుదల కు ఇంకో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న కారణంగా ఇక ప్రమోషన్స్‌ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న రాధేశ్యామ్‌ సినిమా చిత్రీకరణ కు దాదాపుగా మూడు ఏళ్ల సమయం పట్టింది.

విక్రమాధిత్యగా ప్రభాస్ కనిపించబోతున్నాడు.అత్యధునిక జ్యోతిష్యుడిగా ఆయన కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి రాధే శ్యామ్‌ ఒక ప్రత్యేకమైన సినిమాగా దేశ వ్యాప్తంగా అభిమానులు నచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

Telugu Pooja Hegde, Prabhas, Radeshyam-Movie

విదేశాల్లో కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు.కనుక ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకే అతి త్వరలోనే విదేశాల్లో భారీ వేడుక ఒకటి ప్లాన్ చేస్తున్నారట.

ఆమద్య సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ సినిమా కోసం విదేశాల్లో ఈవెంట్ ను నిర్వహించారు.ఇప్పుడు అలాంటిదే విదేశాల్లో నిర్వహించేందుకు గాను యూవీ క్రియేషన్స్ వారు ప్లాన్‌ చేస్తున్నారు.

అంతర్జాతీయ వేదిక మీద సినిమాను పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న రాధే శ్యామ్‌ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయడం ద్వారా భారీ వసూళ్లను దండుకోవాలని భావిస్తున్నారు.

కాని ఆర్ ఆర్‌ ఆర్ వల్ల ఎంత లాస్ ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించగా రాధా కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

కృష్టం రాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube