పూనమ్ పాండేను తీవ్రంగా గాయపరిచిన భర్త.. ఆసుపత్రిలో అడ్మిట్!

బాలీవుడ్ మోడల్, హీరోయిన్ అయినా పూనమ్ పాండే పై ఆమె భర్త సామ్ అహ్మద్ బాంబే దాడి చేసాడు.ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

 Poonam Pandey Gets Husband Arrested For Assault Actress Admitted To Hospital Det-TeluguStop.com

దీంతో ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది.ఈ ఘటనపై పూనమ్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేసారు.

పూనమ్ ఇచ్చిన ఫిర్యాదులో ఇలా ఉంది.

పూనమ్ పాండే ను సామ్ బాంబే 2010 సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు.

చాలా కాలం రిలేషన్ లో ఉన్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు.అయితే పెళ్ళికి ముందు ఉన్నట్టు పెళ్లి తర్వాత లేదు.

పెళ్లి జరిగిన వారం రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.పెళ్లి తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్లగా అక్కడ తనను శారీరకంగా వేధించాడని సామ్ బాంబేపై ఆమె కేసు పెట్టారు.

అప్పుడే సామ్ బాంబే ను పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ కంప్రమైజ్ కావడంతో కలిసే ఉంటున్నారు.

ఇక ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి గొడవ బయటకు వచ్చింది.

సామ్ బాంబే పూనమ్ పాండేను తీవ్రంగా గాయాపరిచినట్టు సమాచారం.

Telugu Actresspoonam, Poonam Pandey, Poonampandey, Sam Bombay-Movie

ప్రెసెంట్ గాయపడిన పూనమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.ఇక ఈ విషయంపై పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేసారు.పూనమ్ ఫిర్యాదు ప్రకారం.

సామ్ మొదటి భార్య అల్విరాతో మాట్లాడడంతో గొడవ స్టార్ట్ అయ్యిందట.

Telugu Actresspoonam, Poonam Pandey, Poonampandey, Sam Bombay-Movie

ఈ గొడవ కారణంగా కోపం రావడంతో సామ్ పూనమ్ పాండే జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టడమే కాకుండా ముఖం మీద కూడా కొట్టాడు.ఈ దాడిలో పూనమ్ పాండే ఒక కన్ను, ముఖం అంత తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది.ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం బాంద్రా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేసారు.

ఇక ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube