దేశీయ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే( Phone Pe ) యావత్ దేశంలోనే దిగ్గజ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.త్వరగా లాభదాయకమైన కంపెనీగా మారేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీ అంతే వేగంగా ఇతర వ్యాపార ఆలోచనలను రంగంలోకి దించుతోంది.
ఈ క్రమంలో ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్ పే దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక అప్లికేషన్ స్టోర్‌ను( App Store ) ప్రారంభించే పనిలో పడింది.ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారదేశంలో మొబైల్ చెల్లింపుల పరిశ్రమను శాసిస్తున్న వాల్‌మార్ట్ మద్దతుగల సంస్థ ఫోన్ పే నుంచి వస్తున్న కొత్త ఉత్పత్తి ఇది కావటం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే యాప్ స్టోర్ వ్యాపారంలో గూగుల్ ( Google ) అన్నింటికంటే ముందుందనే విషయం తెలిసినదే.స్థానిక డెవలపర్లకు సహాయం చేస్తూ.వినియోగదారులు మెచ్చే అధిక నాణ్యమైన సేవలను అందించటం లక్ష్యంగా గూగుల్ పనిచేస్తున్న సంగతి విదితమే.అంతేకాకుండా అనేక భాషల్లో కూడా పరిష్కారాలు అందించే విధంగా దీనిని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఆమధ్య బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ IndusOSను కొనుగోలు చేసిన తర్వాత యాప్ స్టోర్‌ల మార్కెట్‌లోకి ఫోన్ పే ప్రవేశించాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకొని కస్టమర్లకు మరింత చేరువకావాలని చూస్తోంది.ఫోన్ పే కూడా భారతదేశంలో యాప్ స్టోర్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నట్లు తాజాగా ప్రకటించడం విశేషం.ప్రస్తుతం యాప్ స్టోర్ మార్కెట్‌లో 97 శాతం భారతీయ వినియోగదారులను గూగుల్ ఆదేశిస్తున్నట్లు ఫోన్ పే అధికారిక ప్రతినిధి టెక్ క్రంచ్‌కి తెలిపారు.ప్రస్తుతం తమకు 450 మిలియన్ల యూజర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.