ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా అధికార పార్టీ వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ( Magunta Sreenivasulu Reddy )రాజీనామా చేశారు.
ఈ క్రమంలో త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి( Magunta Raghava Redd ) పోటీ చేస్తారని వెల్లడించారు.
మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా( Prakasam )కు వచ్చి 33 ఏళ్లు గడిచాయని పేర్కొన్నారు.అప్పటినుంచి తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం కొనసాగిందన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కొన్ని అనివార్య కారణాల వలన తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.