స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లికి సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాదే నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే హీరోయిన్ నయనతార పెళ్లికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.లేడీ సూపర్ స్టార్ గా పేరు నయనతార దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ లో నయనతార నటించారు.
ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించే నయనతార సినిమా ప్రమోషన్లకు మాత్రం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా నయనతార ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన నయనతార నేనూ రౌడీనే మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడ్డారు.
కొన్ని రోజుల క్రితం దర్శకుడు విఘ్నేష్ శివన్ ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటోలో నయనతార వేలికి రింగ్ తో కనిపించడంతో నయన్ విఘ్నేష్ శివన్ ల నిశ్చితార్థం జరిగిందని కూడా వార్తలు వచ్చాయి.అయితే పెళ్లికి సంబంధించి విఘ్నేష్ శివన్ కుటుంబం ఈ ఏడాదే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకోగా నయనతార మాత్రం వాళ్లకు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది పెళ్లి చేసుకుందామని నయన్ విఘ్నేష్ కుటుంబానికి చెప్పినట్టు తెలుస్తోంది.
![Telugu Nayanatara, Rumours, Vighnesh Shivan-Movie Telugu Nayanatara, Rumours, Vighnesh Shivan-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/05/reasons-behind-rumours-vighnesh-shivan.jpg )
మరి నయనతార ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా.? లేక వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా.? తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.వచ్చే ఏడాది నయన్ విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.