సాయి పల్లవి పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆమె నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.
శ్యామ్ సింగరాయ్ నుండి ఆమె లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.భారీ ఎత్తున అంచనాలున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు.
ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ శ్యామ్ సింగరాయ్ రూపొందిస్తున్నాడు.కోల్ కత్తా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా లో సాయి పల్లవి రోల్ అత్యంత విభిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇక సాయి పల్లవి నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమా ‘విరాటపర్వం’.రానా హీరోగా నటించిన ఈ సినిమా కు వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు.
విడుదల కు సిద్దంగా ఉన్న విరాటపర్వం సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లకు రాలేదు.విరాట పర్వం సినిమా విడుదల ముంగిట ఆగిపోవడంతో మళ్లీ ఎప్పటికి సినిమా థియేటర్లకు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విరాట పర్వం సినిమా ఇప్పట్లో థియేటర్ కు రాకున్నా కూడా నేడు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్బంగా పోస్టర్ ను విడుదల చేస్తారని అనుకున్నారు.లేదంటే సాయి పల్లవి పాత్ర కు సంబంధించిన టీజర్ ను అయినా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా వేణు ఉడుగుల ఈ సినిమా ను రూపొందించాడు అంటూ ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు ట్రైలర్ తో అనిపిస్తుంది.
కాని సాయి పల్లవి పోస్టర్ ను మాత్రం దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేయలేదు.పైగా ఈ సమయంలో పోస్టర్ ను విడుదల చేయాలనుకోవడం లేదు అంటూ ఆమెకు తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
వేణు ఉడుగుల ఇన్ స్టాలో… ఈ సంక్షోభ సందర్బాన,మీకు పుట్టినరోజు విషెస్ చెప్పటం సహేతుకం అనిపించలేదు.అందుకే #Virataparvam పోస్టర్ ని కూడా విడుదల చేయలేదు.మీ అభినయ విశేషముతో ఈ రత్నఖచిత భువనాన తీరొక్క పూల కవనమై వెలుగొందే మీలాంటి హృదయగత జీవులంతా బాగుండాలి.కాలానికి ఎదురీది నిలబడాలి.
జీతే రహో Saipallavi గారు… అంటూ పోస్ట్ చేశాడు.