మీడియా మిత్రులు అందరూ చెబుతున్నట్టు జమునను అతి సాధారణ వ్యక్తిగా ఈ లోకం నుంచి పంపించేశాం.86 ఏళ్ల సంపూర్ణ జీవితం గడిపిన జమునకు ఇంతటి సాధారణ అంతిమ సంస్కారాలను చూసి అప్పటి తరం వారు నోరెళ్ళ బెడుతున్నారు.మరి అసాధారణ రీతిలో జరగడానికి ఆమె జీవితంలో కొన్ని విషయాలు అడ్డంకులుగా ఉన్నాయి.ముఖ్యమైనది ఆమె టాప్ ప్రొడ్యూసర్స్ ఉన్నవారికి సంబంధించిన కులంలో పుట్టకపోవడం ఒక కారణమైతే, ఆమె పిల్లలు ఎవ్వరూ కూడా స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ కాలేదు అది కూడా మరొక కారణం.
ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా జమున అంత్యక్రియలు ఈరోజు ఇలాంటి పరిస్థితులలో జరిగేవి కాదు.
ఇక ఆమె బ్రతికున్నప్పుడు కూడా ఎవరికి తలవంచి బ్రతకలేదు.పైగా రాజకీయాలు నడిపిన కూడా ఆమె ఎంతో హుందా గానే జీవించింది.కాంగ్రెసు మరియు బీజేపీలో కొన్నాళ్లపాటు కొనసాగిన చివరికి ఆమెను ఈ రెండు పార్టీల వారు కూడా అక్కున చేర్చుకోకపోవడం గమనార్హం.
రాజకీయమనే బురద ఆమె ఒంటికి అంటించుకోలేదు కాబట్టి నేటి రాజకీయాలతో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవు.పైగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో గౌరవంగా ఆమె పక్కకు తప్పుకుంది.
ఒకసారి సినిమాలు ఆపేసిన తర్వాత ఆ మళ్లీ డబ్బుల కోసం పబ్లిసిటీ కోసమో ఒక్క చిత్రంలో కూడా జమున నటించలేదు.
ఇక మనుషులకు ఉన్న అతి నీచమైన బుద్ధి కులం.జమున కన్ను మూయగానే ఆమె ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని గూగుల్లో చాలామంది సెర్చ్ చేశారు.సరే ఇదంతా పక్కన పెడితే అధికారిక లాంచనాలు చేయడానికి జమున కి ఏం తక్కువ చెప్పండి.
సావిత్రి లాంటి మహా నటీమణి కి సమకాలీకునురాలు, 198 సినిమాల్లో నటించింది.కుటుంబం, సినిమా వంటి అన్నిట్లో ఆమె ఒక విజయవంతమైన నటి.హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో చేసిన ఫ్యాన్ ఇండియా నటి.అయినా కూడా ఏ భాష కూడా ఆమెను గుర్తు చేసుకోకపోవడం బాధాకరం.