బిగ్ బాస్-6( Bigg Boss 6 ) ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టించింది.సరైరన కంటెస్టెంట్స్ లేకపోవడం, కంటెంట్ నచ్చకపోవడంతో రేటింగ్స్ బాగా తగ్గాయి.
గత సీజన్‌ను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు.రేటింగ్స్ బాగా తగ్గడంతో టీవీ చానెల్‌పై ఎఫెక్ట్ బాగా పడింది.
బిగ్ బాస్ 6 రొటీన్‌గా ఉండటం, పాత టాస్క్‌లు కావడంతో ఎవరూ చూసేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో ఈ సారి బిగ్ బాస్-7ను వినూత్నంగా ప్లాన్ చేశారు.
ఉల్టా పుల్టా పేరుతో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా దీనిని నడిపిస్తున్నారు.ట్విస్టులు, వినూత్న టాస్క్ లతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్-7లోని కంటెస్టెంట్స్( Bigg Boss 7 Contestants ) కూడా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.టీఆర్పీ రేటింగ్స్ ను చూస్తే ఇది అర్థమవుతోంది.బిగ్ బాస్ సీజన్ 6తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్‌ను 40 శాతం మంది ఎక్కువగా చూశారు.బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ను 29 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించినట్లు గణాంకాలు చెబుతన్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం నుంచే షోపై నిర్వహకులు దృష్టి పెట్టారు.ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తన్నారు.అయితే నాగార్జున కనిపించే వీకెండ్స్ లో తప్పితే మిగతా రోజుల్లో వీక్ ఫర్ ఫామెన్స్ ఉంది.
అయితే తాజాగా బిగ్ బాస్ విడుదల చేసిన ఒక యాడ్ పై విమర్శలు వస్తున్నాయి.
ఈ యాడ్ ను చూస్తే మరీ ఇంత దిగజారుడు ఎందుకని అనిపిస్తుంది.ఈ యాడ్ లో బిగ్ బాస్ కు 18.1 రేటింగ్( Bigg Boss Show Ratings ) వచ్చిందని స్టార్ మా ప్రచారం చేసుకుంది.కానీ స్టార్ యాడ్ లో చూపించిన రేటింగ్స్ తప్పు అని తేలింది.
బార్క్ రేటింగ్స్( BARC TRP Ratings ) ప్రకారం టాప్ 30లో బిగ్ బాస్ షో 24లో ఉంది.ఇక ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ కలిపి చూస్తే 15లో ఉంది.దీంతో 18.1 ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.5.1 కోట్ల వ్యూస్ వచ్చినట్లు స్టార్ మా చెబుతున్నది కూడా అబద్దమని చెబుతున్నారు.
ఇలాంటి తలతిక్క యాడ్ లు మల్టీ నేషనల్ ప్రొడక్స్ యాడ్స్ లో కనిపిస్తుంటాయి.కానీ స్టార్ మా( Star Maa ) ఇలా తప్పుడు ప్రచారం చేసుకోవడంపై ఆరోపణలు వస్తున్నాయి.ఇక బిగ్ బాస్ -7కి కూడా కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదు.మొత్తం 14 మందిలో రతిక, శోభ, ప్రియాకం , శివాజీ, ప్రశాంత్ మినహా మిగతావరు ఎవరికీ పెద్దగా తెలియదు.
ప్రశాంత్, శివాజీ ఓవరాక్షన్ ఎక్కువగా ఉంటనే విమర్శలు కూడా వస్తున్నాయి.