టాలీవుడ్ లో మరో కేస్.. థమన్ కు కరోనా..!

టాలీవుడ్ లో కరోనా ఓ రేంజ్ లో విజృంభిస్తుంది.ఈమధ్యనే మంచు మనోజ్, మంచు లక్ష్మి కరోనా బారిన పడగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు.

 Music Director Thaman Tested Covid Positive, Music Director , Tollywood , Corona-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం.టాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు థమన్.

లేటెస్ట్ గా థమన్ చాలా సినిమాలకు సైన్ చేశాడు.ఇక ఇప్పుడు థమన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

థమన్ కు కరోనా పాజిటివ్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు కానీ ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్స్ నుండి థమన్ కొవిడ్ బారిన పడిన విషయం లీక్ అయ్యింది. ఈమధ్యనే థమన్ మహేష్ ని కలిశాడు.

అంతేకాదు రెండు రోజుల క్రితం శివ కార్తికేయన్, అనుదీప్ కెవి సినిమా యూనిట్ ని కలిశాడు.నైట్ మొత్తం సరదాగా గడిపామని మెసేజ్ చేశాడు.

టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది.వరుసగా సినీ సెలబ్రిటీస్ కు కొవిడ్ పాజిటివ్ వస్తూ షాక్ ఇస్తుంది.

కరోనా థర్డ్ వేవ్ టాలీవుడ్ మీద పంజా విసురుతుంది.మహేష్ కు కరోనా అని తెలిసిన వెంటనే మహేష్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశాడు థమన్.

ఇప్పుడు అతనికి కరోనా సోకింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube