తెలుగు సినిమా ఇండస్ట్రీ మాస్ మహారాజ్ గా పేరుపొందిన రవితేజ ( Ravi Teja )చాలా సినిమాల్లో నటిస్తూ తనకంటూ బిజీగా గడుపుతున్నాడు.రవితేజ గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) డైరెక్షన్ లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ పోషిస్తున్నాడు.
ఈ సినిమా క్రాక్ సినిమాకి సీక్వెల్ గా ఉంటుందా లేదా ఇది వేరే ఫ్రెష్ కథతో తెరకెక్కుతుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే ఇప్పటికే గోపి చంద్ మలినేని రవితేజ కాంబినేషన్ వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఇది నాలుగో సినిమాగా వీళ్ళ కాంబో లో ఇది నాల్గోవ సినిమాగా తెరకెక్కుతుంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రవితేజ నెక్స్ట్ బాలీవుడ్( Bollywood ) ప్రాజెక్టులో చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక వివరాల్లోకి వెళ్తే అక్షయ్ కుమార్( Akshay Kumar ) హీరోగా బాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ లో రవితేజ కూడా నటించబోతున్నాట్టుగా సమాచారం అయితే వస్తుంది.
ఇక ఇప్పటివరకు డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని, రవితేజని కలిసి కథ చెప్పినట్టుగా కొన్ని వార్తలయితే వస్తున్నాయి కానీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ రవితేజ బాలీవుడ్ సినిమా చేసినట్లయితే రవితేజకు విపరీతమైన మార్కెట్ పెరుగుతుంది.అలాగే ఆయన క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెరుగుతుంది.ఇక రీసెంట్ గా రవితేజ తెలుగు లో చేసిన టైగర్ నాగేశ్వర రావు సినిమా( Tiger Nageswara Rao movie ) అవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది…ఇక రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని సినిమాతో పాటు గా మరో తెలుగు సినిమా కూడా చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక రవి తేజ చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీ లో ఆయన స్థాయి ని పెంచుతాయి అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.