తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.కార్మికులు, చిరు ఉద్యోగులను పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.
మహిళలని చూడకుండా అర్ధరాత్రి స్టేషన్లలో పెట్టించిన చరిత్ర కూడా కాంగ్రెస్ దేనని మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు.ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా చిరు ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని కేసీఆర్ చెప్పారని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని హరీశ్ రావు స్పష్టం చేశారు.