మంచు మనోజ్‌, మౌనిక ప్రేమ కథను సినిమాగా తీయవచ్చా?

మంచు మనోజ్‌( Manchu Manoj ) మరియు మౌనిక రెడ్డిల( Maunika Reddy ) వివాహం గురించి ఈ మధ్య కాలంలో తెగ ప్రచారం జరుగుతోంది.ఇద్దరి యొక్క ప్రేమ విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే అతి ఏమో అనుకున్నాం.

 Manchu Manoj And Mounika Marriage Issue As Movie , Manchu Manoj, Mounika Reddy,-TeluguStop.com

కానీ ఇటీవల అలా మొదలైంది అంటూ ఒక టాక్ షో లో పాల్గొన్న మంచు మనోజ్ మరియు మౌనిక లు తమ ప్రేమ గురించి చెప్పారు.సినిమా కావాలా మౌనిక ప్రేమ కావాలా అంటూ ఒకానొక సమయంలో పరిస్తితి ఎదురైంది అంటూ మనోజ్ కామెంట్స్ చేశాడు.

ఆ సమయంలో మౌనిక వెంట నిలవకుంటే తన జీవితం వేస్ట్‌ అనిపించింది.అందుకే ఆమె కు మద్దతుగా నిలిచాను.

సినిమా కెరీర్ ను వదిలేసి మరీ ఆమె కోసం నిలుచున్నాను అంటూ మనోజ్ పేర్కొన్నాడు.ఒక బిడ్డకు తల్లి అయిన మౌనిక ను మనోజ్ పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం.

అంతే కాకుండా ఆ బిడ్డను తన బిడ్డ అంటూ ప్రకటించడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మౌనిక తో మనోజ్ కు పరిచయం చాలా సంవత్సరాల క్రితం ఉంది.

ఆసమయంలో ప్రేమ ఉందా లేదా అనే విషయం తెలియదు కానీ ఇద్దరు మంచి స్నేహితులు అని మాత్రం వార్తలు వస్తున్నాయి.

మనోజ్ తన భార్య కు విడాకులు ఇవ్వడం.మౌనిక కూడా తన భర్త నుండి దూరంగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది.అలా ఏర్పడిన సన్నిహిత్యంతో పెళ్లికి సిద్దం అయ్యారు.

ఇద్దరు కూడా రెండవ పెళ్లికి చెందిన వారే అయినా కూడా అటు ఇటు ఒప్పుకోలేదు.ముఖ్యంగా మంచు వారి ఫ్యామిలీ నుండి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది.

అయినా కూడా కెరీర్‌ ను పక్కకు పెట్టి మనోజ్ తన ప్రేమను దక్కించుకునేందుకు సిద్ధం అయ్యాడు.ప్రేమ కోసం మనోజ్ చేసిన సాహసాలు మరియు మౌనిక యొక్క గొప్పతనం గురించి ఒక సినిమానే తీయవచ్చు కదా అంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరైనా మంచి దర్శకుడు వీరి కథను ఎంపిక చేసుకుని సినిమా తీస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.శివ నిర్వాన వంటి దర్శకులు ముందుకు వస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube