మనసంతా నువ్వే సినిమా ఉదయ్ కిరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పాలి.ఉదయ్ కిరణ్ చేసిన మొదటి మూడు చిత్రాలు అయినా చితం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో మంచి విజయాలను అందుకొని అప్పుడున్న యంగ్ హీరోలందరికీ తాను ఒక్కడు ఉన్నాడు అని తెలిసేలా గట్టి సవాల్ విసిరాడు.
అలాగే అప్పుడున్న యంగ్ హీరోల్లో కెరియర్ మొదట్లోనే వరుసగా మూడు హిట్లు కొట్టిన హీరో లేడు.ఇక అసలు విషయం లోకి వస్తే ఈ సినిమా డైరెక్టర్ అయినా వి ఎన్ ఆదిత్య ఈ స్టోరీ ని మొదటగా మహేష్ బాబు తో చేద్దామనుకొని ఆయనకి కథ చెప్పారట కానీ ఆ కథ మహేష్ బాబు కి పెద్దగా నచ్చక తను చేయనని చెప్పారట దాంతో ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ ని హీరో గా తీసుకున్నారు.
ఇలా మహేష్ బాబు ఒక మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటె ఉదయ్ కిరణ్ వరుసగా మూడు సినిమాలు హిట్టు కొట్టిన తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని కారణాల మూలంగా ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు పెద్దగా ఆడలేదు.అట్లాగే ఆయన కెరియర్ కూడా చాలా డౌన్ అయిందనే చెప్పాలి దింతో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక మహేష్ బాబు మాత్రం హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ సూపర్ స్టార్ గా ఎదిగారు…

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా చేస్తున్నారు ఇది పూర్తి అయినా వెంటనే దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాలో మహేష్ ని మనం ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పాత్ర లో చూడబోతున్నట్టు రాజమౌళి గారు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు…
.