టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న హీరోలలో సూర్య ఒకరు.సూర్య నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా సూర్య ఒక ఇంటర్వ్యూలో హీరో విజయ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ అని సూర్య తెలిపారు.
జ్యోతిక నాకన్నా పెద్ద స్టార్ అని సూర్య చెప్పుకొచ్చారు.
మా పేరెంట్స్ ను సంతోషంగా ఉంచుతున్నానని దియా కూడా పెద్దైన తర్వాత మమ్మల్ని చూసి గర్వంగా ఫీలవుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.జ్యోతికకు భర్తగా ఉండటం ఆనందాన్ని ఇస్తుందని పాపకు మంచి తండ్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.
నేను స్కూల్ లో ఉన్న సమయంలో లేట్ కామర్స్ ఇన్ఛార్జ్ లీడర్ గా ఉండేవాడినని కానీ నేనే స్కూల్ కు లేట్ గా వచ్చేవాడినని ఆయన తెలిపారు.
నా బ్యాడ్జ్ తో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ ను పరుగులు పెట్టించేవాడినని సూర్య అన్నారు.లయోలా కాలేజ్ లో కామర్స్ డిగ్రీ చదివే సమయంలో విజయ్ నా క్లాస్ మేట్ అని సూర్య నేను, విజయ్ ఒకే బేంచ్ లో కూర్చునేవాళ్లమని అయితే చివరి వరకు నాతో లేడు అని ఆయన తెలిపారు.నేను చెన్నై బేస్డ్ కంపెనీలో మర్చెండైజర్ గా జాబ్ చేశానని చాలా దేశాలకు షర్ట్స్ ఎక్స్ పోర్ట్ చేసేవాళ్లమని సూర్య పేర్కొన్నారు.
అజిత్ చేయాల్సిన సినిమాలో నేను నటించానని ఆ సినిమానే నీను కన్నీర్ అని సూర్య తెలిపారు.జ్యోతికకు పెద్ద అభిమానినని సూర్య తెలిపారు.సూర్య వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.సూర్యకు మాస్ ప్రేక్షకుల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.