తెలంగాణా సీఎం కేసీఆర్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికే బాబు కి కంటిమీద కునుకు ఉండటం లేదు.నిద్రల కూడా ఉలిక్కి పడి కేసీఆర్ ఆరోజు చేసిన వ్యాఖ్యలపై మల్ల గుల్లాలు పడుతున్నాడట.
ఇంతకీ ఏమిటా వ్యాఖ్యలు.అంటే తనని ఓడించడానికి తెలంగాణలోకి సైకిల్ వేసుకుని వచ్చేసిన బాబు కి అదిరిపోయేలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ కామెంట్స్ చేశారు కేసీఆర్.
అంతే ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ బాబు కి ఆ రిటర్న్ గిఫ్ట్ మీదే ధ్యాస.అయితే తాజాగా కేసీఆర్ బాబు కి ఇవ్వలనుకునే రిటర్న్ గిఫ్ట్ పై ఓ క్లారిటీ కి వచ్చేశాడట.

అలాంటి ఇలాంటి క్లారిటీ కాదు.బాబు కి దిమ్మతిరిగిపోయే క్లారిటీ అది అంటున్నారు.సరే ఇంతకీ ఏమిటా క్లారిటీ ఏమిటా గిఫ్ట్ అంటే.ఏపీ రాజకీయాల్లోకి మేము వస్తాం.బాబుకి చుక్కలు చూపిస్తాం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు కార్య రూపం వస్తోందట.విశ్వసనీయ వర్గాల సమాచారమ ప్రకారం.
ఎంఐఎం రూపంలో చంద్రబాబుకు కేసీఆర్ భారీ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.ఎంఐఎం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు ఆయన పక్కా వ్యూహంతో ప్రణాలికలు రచించారని తెలుస్తోంది.
ఏపీలో ముస్లిమ్స్ కోసం ముస్లిమ్స్ సేవియర్ గా ఏపీ రాజకీయాల్లో ప్రవేశించేందుకు ఎంఐఎం అన్ని సిద్దం చేస్తోందట.అసదుద్దీన్ ఒవైసీ ప్రస్తుతానికి ఆ పనులలోనే బిజీ బిజీ గా ఉన్నారని తెలుస్తోంది.
అంతేకాదు ఏపీ నుంచి ముస్లిం నేతలను పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.వారు రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ పరిస్థితి.ఎలాంటి ప్రయోజనాలు తమకి కావాలి అనే విషయాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తమకి మద్దతు ఇవ్వాలని ఏపీ ముస్లిం నేతలని ఎంఐఎమ్ కోరుతోందట.

ఇదిలాఉంటే ఏపీలో ముస్లిమ్స్ పట్టు ఉన్న చోట బలంగా తమ పార్టీని తీసుకు వెళ్ళే వ్యుహలని రచిస్తోందట.సాధ్యమైనన్ని ఎక్క్వుఅగా స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా ఉందని అంటున్నారు.వచ్చే ఎన్నికల్లో గనుకా అసదుద్దీన్ ఎంట్రీ ఇస్తే తప్పకుండా టీడీపీ ముస్లిం ఓటర్లు దూరం అవుతారని ఈ ప్రభావం జగన్ కి బాగా కలిసొస్తుందని అంటున్నారు పరిశీలకులు.దాంతో ఎంఐఎం ద్వారా ఓట్లు చీల్చడమే బాబు కి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటునారు విశ్లేషకులు.