ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.కాని సినినటి అంజలి విషయంలో అది రివర్స్ రచ్చ గెలిచాక ఇంట గెలిచి చూపించింది.
తెలుగు అమ్మాయి అయినప్పటికి తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకున్నాక తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది.ఇక్కడ కూడా మంచి అవకాశాలే వరించాయి.
ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నా అందమే అన్నట్టు.అంజిలి బొద్దుగా ఉన్నా ప్రేక్షకులు ఆదరించారు.

కాని ఇప్పుడు అంజలిని చూస్తే బొద్దుగుమ్మ చిక్కినా అందమే అంటారు.అది కూడా మామూలుగా కాదు… అంజలిని చూసినవారు నోరెళ్లబెడుతున్నారంటే ఆవిడ ఏ రేంజ్లో షాక్ ఇచ్చింది అర్దం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో అంజలి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయిఅవి చూసి జనాలు వావ్ అంటూ షాకైపోతున్నారు.మన అంజలేనా అని నోరెళ్లబెడుతున్నారు.బాడీలో చాలా మార్పు కనిపిస్తోంది.

ముఖ్యంగా ఆమె నడుము భాగంలో వచ్చిన మార్పు అయితే నిజంగా షాకింగే.గతంలో వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించి తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గరైన అంజలికి ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాలే వచ్చాయి.కాస్త బొద్దుగా ఉండటంతో యంగ్ హీరోలు ఆమెతో నటించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఆమె ఫిజిక్ ను తగ్గించే పనిలో పడి సక్సెస్ అయింది.

మొత్తానికి అంజలి కెరీర్ ముగిసిందనుకుంటున్న టైంలో ఇంత మార్పు చూపించడం ఆశ్చర్యకరం.తెలుగులో గీతాంజలి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అంజలి.ఆ చిత్రం కోసమే ఇంతలా సన్నబడిందో.
లేక క్యాజువల్ గానే మార్పు చూపిస్తోందో గానీ.కారణమేదైనా ఈ మార్పు తో ఆమెకి అవకాశాలు రావడం ఖాయం అనిపిస్తుంది.

అయితే అంజలి పోస్టు చేసిన ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా రేలంగి మావయ్యదగ్గరికి పంపిస్తే సరి అని… రేలంగి మావయ్య ఎవరో గుర్తున్నారు కదా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అంజలికి మామగా నటించిన ప్రకాష్ రాజ్.ఆ సినిమాలో అంజలి మామయ్య గారాలకోడలిగా సంప్రదాయంగా,పద్దతిగా చూడముచ్చటగా ఉంటుంది మరి…
.