కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టే..: మాజీ మంత్రి జూపల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు.కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన ఆయన దాని వలన ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు.

 Kcr Has Accepted Defeat..: Former Minister Jupalli-TeluguStop.com

ఎవరెవరు ఎలాంటి వారో తెలంగాణ మొత్తం చూసిందని జూపల్లి విమర్శించారు.కేసీఆర్ కు మైనంపల్లి దెబ్బ రుచి చూపించాలన్నారు.

పట్నం మహేందర్ రెడ్డి పౌరుషం చూపించాలన్న జూపల్లి గజ్వేల్, కామారెడ్డిలో పోటీతో కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు.గత మేనిఫెస్టోను కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు.

ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కొల్లాపూర్ నుంచి పోటీకి అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవసరమేనన్న జూపల్లి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడును కాంగ్రెస్ పూర్తి చేసిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube