కార్తికేయ‌కు కాబోయే భార్య ఆర్‌ఎక్స్‌100 సినిమా చూడలేదట.. కారణమేంటంటే?

యంగ్ హీరో కార్తికేయ కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాలలో ఆర్‌ఎక్స్‌100 సినిమా కూడా ఒకటి.అన్ని రకాల పాత్రలలో నటిస్తూ కార్తికేయ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే.

 Karthikeya Interview About His Would Be Lohitha And His Upcoming Movies, Karthik-TeluguStop.com

శ్రీ సరిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజా విక్రమార్క సినిమాలో కార్తికేయ నటించగా 88 రామారెడ్డి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా కార్తికేయ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ లో ఈ సినిమాలో తాను నటిస్తున్నానని కార్తికేయ అన్నారు.సినిమాలో ఆనవసరపు సీన్స్ ఒక్కటి కూడా ఉండవని కార్తికేయ చెప్పుకొచ్చారు.

దర్శకుడి నిజాయితీ, కాన్ఫిడెన్స్ నచ్చడంతో ఈ సినిమాకు తాను వెంటనే ఓకే చెప్పానని కార్తికేయ చెప్పుకొచ్చారు.ట్రైలర్ లో తన కామెడీకి ప్రశంసలు దక్కాయని బయట ఏ విధంగా ఉంటానో సినిమాలో అలానే కనిపించానని కార్తికేయ తెలిపారు.

Telugu Lohitha, Payal Rajputj, Tollywood-Movie

సినిమాకు మొదట వేరే టైటిల్ ను పరిశీలించి చివరకు రాజా విక్రమార్క అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని కార్తికేయ చెప్పుకొచ్చారు.మార్కెట్ లెక్కలను పట్టించుకోకుండా గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నానని కార్తికేయ వెల్లడించారు.లోహితకు ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఎక్కడా దక్కలేదని మళ్లీ ఆ ఛాన్స్ రాదని భావించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రేమను వ్యక్తపరిచానని కార్తికేయ చెప్పుకొచ్చారు.

Telugu Lohitha, Payal Rajputj, Tollywood-Movie

లోహిత ఆర్‌ఎక్స్‌100 సినిమాను చూడలేదని ఆ సినిమా రిలీజ్ కు ముందు గొడవ జరగడంతో కొన్నిరోజులు మాట్లాడుకోలేదని ఆ తర్వాత తను చూస్తానని చెప్పినా తాను వద్దని చెప్పానని కార్తికేయ తెలిపారు.వాలిమై సినిమాలో నెగిటివ్ రోల్ లో చేస్తున్నానని వాలిమైలో తాను చేసిన బైక్ స్టంట్స్ కొత్తగా ఉంటాయని కార్తికేయ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube