ఖిల్లా వరంగల్ లోని కాకతీయుల కాలంలో నిర్మించిన కోట ను సందర్శించిన కమల్ చంద్ర బాంజ్ కాకతీయ గారు

కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమంలో లో భాగంగా కాకతీయ 22 వ వారసుడు కమల్ చంద్ర బాంజ్ కాకతీయ గారు రాష్ట్ర మంత్రులు శ్రీ V.శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గార్ల తో కలసి ఖిల్లా వరంగల్ లోని కాకతీయుల కాలంలో నిర్మించిన కోట ను సందర్శించారు.

 Kamal Chandra Banj Kakatiya Garu Visited The Fort Built During The Kakatiya Peri-TeluguStop.com

కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమంలో లో భాగంగా, స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో కాకతీయ వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ కు ఓరుగల్లు కోట వద్ద భారీ ఘన స్వాగతం లభించింది.వేలాదిమంది ప్రజలు, కళాకారులు దారి వెంట నిలిచి ఘన స్వాగతం పలికారు.

పూలు చల్లి కాకతీయ పూర్వ రాజవంశానికి చెందిన వారసుడి పట్ల ప్రత్యేక అభిమానం చూపారు.రాజవంశం కు చెందిన వారసుడి ని చూడటానికి మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఫోటోలు, సెల్ఫీ లు ఆనందంతో దిగారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్ తరుణ్ జోషీ, Kuda చైర్మన్ సుందర్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube