ఖిల్లా వరంగల్ లోని కాకతీయుల కాలంలో నిర్మించిన కోట ను సందర్శించిన కమల్ చంద్ర బాంజ్ కాకతీయ గారు
TeluguStop.com
కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమంలో లో భాగంగా కాకతీయ 22 వ వారసుడు కమల్ చంద్ర బాంజ్ కాకతీయ గారు రాష్ట్ర మంత్రులు శ్రీ V.
శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గార్ల తో కలసి ఖిల్లా వరంగల్ లోని కాకతీయుల కాలంలో నిర్మించిన కోట ను సందర్శించారు.
కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమంలో లో భాగంగా, స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో కాకతీయ వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ కు ఓరుగల్లు కోట వద్ద భారీ ఘన స్వాగతం లభించింది.
వేలాదిమంది ప్రజలు, కళాకారులు దారి వెంట నిలిచి ఘన స్వాగతం పలికారు.పూలు చల్లి కాకతీయ పూర్వ రాజవంశానికి చెందిన వారసుడి పట్ల ప్రత్యేక అభిమానం చూపారు.
రాజవంశం కు చెందిన వారసుడి ని చూడటానికి మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఫోటోలు, సెల్ఫీ లు ఆనందంతో దిగారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్ తరుణ్ జోషీ, Kuda చైర్మన్ సుందర్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
వామ్మో.. అక్కడ ప్రతి ఒక్క మహిళకి ఆరు అడుగులపైనే జుట్టు.. ఎందుకంటే?