ఏపీలో మరోసారి వైసిపి ప్రభుత్వం ఏర్పడకుండా చూడడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన( Telugu Desam, Janasena ) పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి.వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఒంటరిగా గెలవడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చిన టిడిపి, జనసేనలు పొత్తుల ద్వారానే వైసిపి ఓటమి ఖాయం అనే నిర్ణయానికి వచ్చాయి.
ఈ మేరకు రెండు పార్టీల అధినేతలు పొత్తులపై క్లారిటీ కి వచ్చారు.పొత్తుల విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగానే ఉన్నారు.
జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలను ఆ పార్టీకి కేటాయించేందుకు , పవన్ కు ప్రాధాన్యం ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నారు.టిడిపి చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ సైతం అదే వైఖరితో ఉన్నారు.
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల్లోనూ పొత్తు అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా టిడిపి , జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు నియోజకవర్గాల వారిగా జరుగుతున్నాయి.
![Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenani, Jyothula Nehru, Pavan Kalyan, Tdpj Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenani, Jyothula Nehru, Pavan Kalyan, Tdpj](https://telugustop.com/wp-content/uploads/2023/11/AP-government-BJP-ap-CM-Jagan-Patamsetti-Suryachandra-Jyothula-Nehru.jpg)
ఇక్కడే రెండు పార్టీల నేతల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్తోంది.వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని టిడిపి, లేదు తామే ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నామని, తామే పోటీ చేస్తామని ప్రకటించుకోవడం వివాదాలకు కారణం అవుతుంది.ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో వివాదాలు చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం రెండు పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది.ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో( East Godavari District ) ఈ తరహా వివాదాలు చేసుకోవడం కలవరం పుట్టిస్తుంది.
మంగళవారం కాకినాడ జిల్లా పిఠాపురం లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో టిడిపి, జనసేన నేతలు ఒకరిపై ఒకరు దూషణలకు దిగడం, ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం వంటివి వైరల్ గా మారాయి.జగ్గంపేట టిడిపి , జనసేన ఆత్మీయ సమావేశంమూ ఇదే విధంగా రచ్చగా మారింది.
టిడిపి, జనసేన పొత్తులో భాగంగా టికెట్ తనదేనని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.పవన్ కళ్యాణ్ సైతం తనవైపే ఉన్నాడని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటింశెట్టి సూర్యచంద్రరావు( Patamsetti Suryachandra )కు టికెట్ ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల నెహ్రూ బహిరంగంగానే ప్రకటించడంతో జనసేన ఈ సమావేశాన్ని బహిష్కరించింది.
దీంతో జ్యోతుల తనయుడు నవీన్ జనసేన నాయకుడు సూర్యచంద్రరావు మధ్య తోపులాట చోటుచేసుకుంది.రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
![Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenani, Jyothula Nehru, Pavan Kalyan, Tdpj Telugu Ap Cm Jagan, Ap, Janasena, Janasenani, Jyothula Nehru, Pavan Kalyan, Tdpj](https://telugustop.com/wp-content/uploads/2023/11/ysrcp-AP-government-BJP-ap-CM-Jagan-Patamsetti-Suryachandra.jpg)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంది .ఉమ్మడి తూర్పు , పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనకు సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ కూడా అంచనా వేస్తోంది.ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జనసేన తరపున చాలామంది ఆసక్తితో ఉన్నారు.అయితే జనసేన టిడిపి అధిష్టానాలు సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా, ముందుగానే టిడిపి టికెట్ ఆశిస్తున్న నేతలు జనసేనకు ఈ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చేదే లేదు అంటూ ప్రకటనలు చేయడం జనసేన వర్గాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
రెండు పార్టీలు పొత్తులు పట్టుకుని క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా రెండు పార్టీల అధిష్టానాలు దిశా నిర్దేశం చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం టిడిపి జనసేన వర్గాల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోంది.సమన్వయ కమిటీ సమావేశాల సందర్భంగా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య నడుస్తున్న ఆధిపత్తి పోరు ఆయా పార్టీల అధిష్టానానికి తలనొప్పి తెప్పిస్తోంది.