బహుజనులకు బీజేపీ వలనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ నేత బూర నరసయ్య గౌడ్ అన్నారు.సర్వాయి పాపన్నకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని కోరిన వెంటనే పోస్టల్ కవర్ ను విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈనెల 26న హైదరాబాద్ లో అధికారికంగా పోస్టల్ కవర్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు.కానీ తమ వల్లే పోస్టల్ కవర్ విడుదల చేశారని టీఆర్ఎస్ మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ వంటి బహుజన పితామహుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా ఈనెల 27న చౌటుప్పల్ లో గౌడ సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా గీత కార్మికులు తరలి రావాలని బూర పిలుపునిచ్చారు.