ఉస్తాద్ రామ్ రీసెంట్ మూవీ ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర్ బోల్తా కొట్టింది.సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా వచ్చినా సరే ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో రామ్ సినిమా చేస్తున్నాడు.బోయపాటి మార్క్ అంటే బొమ్మ మాస్ ఫీస్ట్ ఉండాల్సిందే.
రామ్ కి బోయపాటి సినిమాతో అయినా స్టార్ క్రేజ్ వస్తుందేమో చూడాలి.ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట.
ఈ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని దించుతున్నట్టు తెలుస్తుంది.
ఊర్వశి రౌతెలా ఇప్పటికే తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమా చేసింది.
అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవలేదు.ఇక ఇప్పుడు ఈ బ్యూటీతో హాట్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఖచ్చితంగా ఈ ఐటం సాంగ్ అదిరిపోతుందని చెప్పొచ్చు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న బోయపాటి రామ్ కాంబో మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.ఈ సినిమాకు అన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి.
మరి సినిమా ఆ రేంజ్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.







