కృతి శెట్టి హీరోయిన్ అవ్వడం కోసం ఆమె తల్లి చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెలుగు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి.ఈ సినిమా విజయం సాధించడంతో ఆమె రేంజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది.

 Krithi Shetty About Her Mother Sacrifice Krithi Shetty , Tollywood, Uppena, Mang-TeluguStop.com

ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో హ్యట్రిక్ అందుకున్న హీరోయిన్ల జాబితాలో కృతి పేరు కూడా చేరింది.వాస్తవానికి కృతి శెట్టి చిన్ననాటి నుంచి హీరోయిన్ అవ్వాలని ఏవి అనుకోలేదు.

ఆమె ముంబైలో చదువుకునేది, చదువుకుంటున్న సమయంలోనే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది.దాని ద్వారా ఆమెకు హిందీలో సినిమాల్లో నటించే అవకాశం లభించింది.

తొలుత ఆమె హిందీ లో సూపర్ 30 లో స్టూడెంట్ గా నటించింది.ఆ తర్వాత బేబమ్మగా మన తెలుగు తెరకి పరిచయమైంది.ఇక ఒకసారి టాలీవుడ్ లో సెటిల్ అయినా తర్వాత ఆమె శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు లాంటి సినిమాల్లో నటించింది.అయితే కృతి హీరోయిన్ గా ఎదగడం లో ఆమె కుటుంబం చేసిన త్యాగం ఎంతగానో ఉందని వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.2003 వ సంవత్సరంలో ముంబైలో పుట్టిన కృతి శెట్టి తులు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.వీరు కర్ణాటక లోని మంగుళూరు వాస్తవ్యులు.

తన తండ్రి వ్యాపార రీత్యా ముంబైకి వచ్చే సెటిల్ అయ్యాడు ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ కృతికి ఒక తమ్ముడు ఒక చెల్లి కూడా ఉన్నారు.

Telugu Karnataka, Kriti Shetty, Mangalore, Mother, Mumbai, Shyam Singh Roy, Warr

ముంబైలో పెరిగిన కృతి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అయితే కృతికి వరసగా అవకాశాలు వస్తుండటం తో కృతి శెట్టి కోసం తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసిందట.కృతి ఎక్కడికి వెళ్లిన కూడా తన తో పాటే తల్లిని కూడా తీసుకెళ్తుంది.అలా తన తల్లి కెరియర్ సైతం కోల్పోయి తనను హీరోయిన్ చేసింది అంటూ ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో కృతి బయటపెట్టింది.

ఆ తర్వాత చాలా మంది కృతి తల్లి చేసిన పనికి శభాష్ అంటున్నారు.ఇక ఈ ఏడాది కూడా వరస సినిమాల్లో కనిపించిన కృతి శెట్టి ప్రస్తుతం మరో మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube