కోలీవుడ్ లో అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న హీరో విక్రం.ఈమధ్య వచ్చిన పిఎస్ 1 సూపర్ హిట్ అయినా ఆ హిట్ కేవలం తన ఒక్కడి ఖాతాలో రాలేదని చెప్పొచ్చు.
పిఎస్ 1 తర్వాత కోబ్రా అంటూ వచ్చిన విక్రం ఆ సినిమాతో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం విక్రం పా రంజిత్ డైరక్షన్ లో తంగలాన్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో గొర్రల కాపరిగా విక్రం కనిపిస్తున్నాడు.విక్రం తంగలాన్ మూవీలో ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విక్రం హీరోగా వచ్చిన శివపుత్రుడు సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఇప్పుడు ఆ సినిమా తరహాలోనే తంగలాన్ సినిమా వస్తుందని చెప్పొచ్చు.షూటింగ్ స్టార్ట్ అంటూ రిలీజ్ చేసిన వీడియోనే అదరగొట్టేసింది.విక్రం తంగలాన్ తెలుగులో కూడా అదే టైటిల్ తో వస్తుంది.
మరి ఈ సినిమా అయినా విక్రం కి అపరిచితుడు, శివపుత్రుడు లాంటి హిట్ సినిమాల సరసన నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.తంగలాన్ మూవీని పా రంజిత్ చాలా క్రేజీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ విక్రం ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు.







