ఈమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సినిమాలకు పెత్తనం మొత్తం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas )చేస్తున్నాడు అనేది చాలా ఓపెన్ సీక్రెట్.ఏ దర్శకుడు అయినా పవన్ దగ్గరకు స్టోరీ వినిపించడానికి వెళ్ళాలి అంటే ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలవాలట.ఆయన స్టోరీ నచ్చితేనే అది పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తుందట.‘వకీల్ సాబ్‘ విషయం అలాగే జరిగింది, ఇక రీసెంట్ గా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘#OG’ సినిమా స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ వద్ద కి వెళ్లే ముందు త్రివిక్రమ్ కి వినిపించాడట డైరెక్టర్ సుజిత్.ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిందట.ప్రస్తుతం ఈ చిత్రం పై ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.వాస్తవానికి అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ నిర్ణయం అయిన మేకర్స్ తీసుకోవాలి.కానీ ఇక్కడ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగానే జరగాలట.
టీజర్ కట్ అయినాయి , పాటలు అయిన విడుదల చేసే ముందు ముందుగా త్రివిక్రమ్ కి నచ్చితేనే ఆన్లైన్ లో విడుదల చేసేందుకు త్రివిక్రమ్ ఒప్పుకుంటాడట.లేదంతే వెయిట్ చెయ్యాల్సిందే.
ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో ‘గుంటూరు కారం‘( Guntur Kaaram ) చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ఆయన బ్రో కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా సమయం పడుతుంది.
అందుకే ప్రమోషన్స్ విషయం లో చాలా లేట్ అయ్యిందని అంటున్నారు.ఇక పాటలు విని ఓకే చేసే సమయం కూడా ఆయనకీ లేకపోవడం తో థమన్ ట్యూన్స్ వివిధ వెర్షన్స్ ని వినకుండానే రఫ్ ట్యూన్స్ విని ఇవే పెట్టమని అన్నాడట.

ఒకవేళ త్రివిక్రమ్ థమన్ అందించిన మిగిలిన వెర్షన్స్ ని కూడా విని ఉంటే, ఇంకా మంచి ట్యూన్స్ వచ్చేవి అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.ఇప్పుడు ఈ చిత్రం మొత్తం ట్రైలర్ మీదనే ఆధారపడి ఉంది.ఒకవేళ ట్రైలర్ అద్భుతంగా ఉంటే మాత్రం, మూవీ పై హైప్ అమాంతం పెరిగిపోతాది.మరోవైపు త్రివిక్రమ్ వల్ల ప్రొమోషన్స్ బాగా ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ సినిమా అటు అయితే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తామని అంటున్నారు ఫ్యాన్స్.చూడాలి మరి ఈ సినిమా పరిస్థితి రాబొయ్యే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.