ఇదేం స‌ర‌దా.. మొస‌లి పంటితో బీర్ ఓపెన్‌.. ఏమాత్రం తేడా వ‌చ్చినా..!

కొంత మంది కొన్ని సందర్బాల్లో చేసే చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వారు చేసే పనులు చికాకు తెప్పిస్తాయి.

 Is This Easy .. Beer Open With Crocodile Teeth .. No Matter What The Difference-TeluguStop.com

దోస్తులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన పలువురు అక్కడ చేసే చేష్టలతో ఒక్కో సారి ఇబ్బందులకు గురవుతుంటారు.ఇలా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ అతడు ఏం చేశాడంటే.

ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి సరదాగా తన స్నేహితులతో కలిసి చెరువులో బోటులో ప్రయాణిస్తూ ఉంటాడు.

ఇంతలో అతడికి ఓ వింత ఆలోచన వచ్చి.వెంటనే ఆ పనిని చేస్తాడు.ఇదంతా వీడియోలో షూట్ చేసిన స్నేహితులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.ఇతడు చేసిన పనిని చూసి నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.

తాను మొసలితో ఆడడమే కాకుండా మొసలి నోరు తెరిచినపుడు తన వద్ద ఉన్న బీరు బాటిల్ మూతను మొసలి పళ్లతో తెరుస్తాడు.ఒక వేళ అతడికి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ రోజు ముసలికి ఆహారంగా మారేవాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇది సోషల్ మీడియాలోనే కాకుండా అక్కడి స్థానిక మీడియాలో కూడా పెద్ద వార్తలా ప్రచురించారు.

ఇలా మొసలి పళ్లతో బీర్ బాటిల్ ఓపెన్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఫ్లోరిడాలో సెలబ్రెటీ లా మారిపోయాడు.ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వీడియోలో ఉన్న అందరు వ్యక్తులపై కేసు బుక్ చేయాలని ఫ్లోరిడా పోలీసులు చూస్తున్నారట.అందుకే ఇలాంటి సిల్లీ పనులు చేయకూడదని మన పెద్దలు తరుచూ చెబుతూ ఉంటారు.

ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాదాపు ఇది పోస్ట్ చేసిన గంటలోనే లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube