ఇదేం స‌ర‌దా.. మొస‌లి పంటితో బీర్ ఓపెన్‌.. ఏమాత్రం తేడా వ‌చ్చినా..!

కొంత మంది కొన్ని సందర్బాల్లో చేసే చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వారు చేసే పనులు చికాకు తెప్పిస్తాయి.దోస్తులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన పలువురు అక్కడ చేసే చేష్టలతో ఒక్కో సారి ఇబ్బందులకు గురవుతుంటారు.

ఇలా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ అతడు ఏం చేశాడంటే.ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి సరదాగా తన స్నేహితులతో కలిసి చెరువులో బోటులో ప్రయాణిస్తూ ఉంటాడు.

ఇంతలో అతడికి ఓ వింత ఆలోచన వచ్చి.వెంటనే ఆ పనిని చేస్తాడు.

ఇదంతా వీడియోలో షూట్ చేసిన స్నేహితులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఇతడు చేసిన పనిని చూసి నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.తాను మొసలితో ఆడడమే కాకుండా మొసలి నోరు తెరిచినపుడు తన వద్ద ఉన్న బీరు బాటిల్ మూతను మొసలి పళ్లతో తెరుస్తాడు.

ఒక వేళ అతడికి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ రోజు ముసలికి ఆహారంగా మారేవాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇది సోషల్ మీడియాలోనే కాకుండా అక్కడి స్థానిక మీడియాలో కూడా పెద్ద వార్తలా ప్రచురించారు.

"""/"/ ఇలా మొసలి పళ్లతో బీర్ బాటిల్ ఓపెన్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఫ్లోరిడాలో సెలబ్రెటీ లా మారిపోయాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వీడియోలో ఉన్న అందరు వ్యక్తులపై కేసు బుక్ చేయాలని ఫ్లోరిడా పోలీసులు చూస్తున్నారట.

అందుకే ఇలాంటి సిల్లీ పనులు చేయకూడదని మన పెద్దలు తరుచూ చెబుతూ ఉంటారు.

ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దాదాపు ఇది పోస్ట్ చేసిన గంటలోనే లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

రైలు కంపార్ట్‌మెంట్‌లో ఇబ్బందికర సమస్య.. చిటికెలో ఫిక్స్ చేసిన మహిళ.. వీడియో చూస్తే..!