తెలంగాణ బిజెపిలో( BJP ) పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ గ్రూపు రాజకీయాలు, అసంతృప్తులు పెరిగిపోవడం ఆ పార్టీ లో ఆందోళన కలిగిస్తుంది.
ముఖ్యంగా పార్టీ పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రాధాన్యం విషయంలో ఒకరిపై ఒకరు అసంతృప్తికి గురవడం వంటివన్నీ ఇటీవల కాలంలో తెలంగాణ బిజెపిలో చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్( Etela Rajender ) పరిస్థితి అయోమయంగా మారింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత ఆయన సీనియారిటీకి తగ్గట్టుగానే చేరికల కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా రాజేందర్ ను నియమించారు.అయితే ఆశించిన స్థాయిలో బిజెపిలో చేరికలు లేకపోవడం, ముఖ్యంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Former MP Ponguleti Srinivas Reddy )బీఆర్ఎస్ లో ఇమడలేక ఆ పార్టీ నుంచి బయటకు రావడం, బీజేపీలో చేరాలని ముందుగా ఆయన భావించినా, చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవడం, ఆయనను పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో ఈటెల రాజేందర్ చర్చలు జరిపినా, సక్సెస్ కాకపోవడం ఇవన్నీ బిజెపి పెద్దలలో అసంతృప్తిని రాజేశాయి.

రాజేందర్ పనితీరు అంతంత మాత్రంగానే ఉందని, ఆయనకు చేరికల్ కమిటీ చైర్మన్ గా అవకాశమిచ్చినా అనుకున్న స్థాయిలో ఆయన పనితీరు లేదనే అసంతృప్తి బిజెపి పెద్దలలోను, రాజేందర్ లోనూ ఉంది.పార్టీలో తన కు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే ఆసంతృప్తి ఆయనలో ఉంది.ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను( Amit Sha ) కలిసినప్పుడు తనకు ప్రచార కమిటీ చైర్మన్ గా అవకాసం ఇస్తారని రాజేందర్ భావించినా, ఆ హామీ రాకపోవడం వంటివి మరింత అసంతృప్తికి గురిచేసేయట.

దీనికి తోడు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) తన ప్రాధాన్యం పెరగకుండా రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం రాజేందర్ లో ఉంది.ఈ విధంగా ఈటెల రాజేందర్ పై బిజెపి అధిష్టానానికి అసంతృప్త ఉండడం, అంతే స్థాయిలో రాజేందర్ కూ పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోందట.
.