జెస్సీకి వచ్చిన వ్యాధి అంత ప్రమాదకరమా.. అసలు నిజాలు ఏంటి?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా తనదైన శైలిలో టాస్క్ లు ఆడుతూ అందరికీ గట్టి పోటీ ఇస్తున్నటువంటి మోడల్ జెస్సీ గత వారం రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే అతను టాస్క్ లలో కూడా సరిగా పాల్గొన్నలేక ఎంతో సతమతమవుతున్నారు.

 Is The Disease That Dangerous For Jesse What Are The Real Facts Bigg Boss 5, Tel-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైద్యుని పంపించి అతనికి పరీక్షలు చేయించారు.అయితే జెస్సి ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడంతో అతనిని కొద్దిరోజుల పాటు సీక్రెట్ రూమ్ లో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నారు అని అతని ఆరోగ్యం పూర్తిగా నయం అయిన తర్వాత తిరిగి హౌస్ లోకి వస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.

గత వారం రోజుల నుంచి జెస్సీ బాధపడుతున్న వ్యాధి ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి అనే విషయానికి వస్తే.

జెస్సీ బాధపడుతున్న వ్యాధిని వైద్య పరిభాషలో వర్టిగో అంటారు.

ఈ లక్షణాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో అధికంగా ఉంటాయి.ఈ వ్యాధి లక్షణాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి.

తల తిరగడం, కళ్ళు మంటలు వేయడం, వాంతుల వడం, కళ్ళు వాటంతటవే మూత పడటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఈ విధమైనటువంటి వర్టిగో రెండు రకాలుగా ఉంటుంది.

అవి పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో.పెరిఫెరల్ వర్టిగో అంటే లోపల చెవిలోని నరాలు బలహీనం అయినప్పుడు ఆ నరాల ద్వారా మెదడుకు చేరవేసే సంకేతాలు దెబ్బ తినడం వల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు బయట
పడతాయి.

అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు కేవలం కళ్ళు తిరగడం తల తిరగడం వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.

Telugu Bigg Boss, Problem, Jesse, Telugu-Movie

సెంట్రల్ వర్టిగో విషయానికి వస్తే ఇది ఎంతో ప్రమాదకరమైనది.కొన్నిసార్లు ఈ వ్యాధి సోకినప్పుడు మెదడుకు ప్రమాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి.ముఖ్యంగా జలుబు చెవి ఇన్ఫెక్షన్ వంటివి జరిగినప్పుడు ఈ ప్రమాదం మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ముఖ్యంగా మందు సిగరెట్ తాగే వారిలో ఈ ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube