దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ గుర్రంపై కనిపిస్తే తారక్ బైక్ పై విన్యాసాలు చేశారు.
సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ కు చాలా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో కూడా జరగనుందని సమాచారం.రాజమౌళి ఈ సినిమా కోసం ఎన్నో వస్తువులను స్పెషల్ గా డిజైన్ చేయించడం గమనార్హం.
తారక్ వాడిన బైక్ 1934 సంవత్సరానికి చెందిన ఎమ్ సిరీస్ మోడల్ అని సమాచారం.వెలోసెట్ మోటార్ బైక్ కంపెనీ అప్పట్లో 350 సీసీ, 500 సీసీ బైక్స్ ను తయారు చేయగా ఈ కంపెనీ 1971 సంవత్సరంలో బైక్స్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయడం గమనార్హం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోటార్ బైక్ నే అప్పటి మోడల్ లా జక్కన్న తయారు చేయించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ బైక్ కోసం జక్కన్న ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేయించారని తెలుస్తోంది.కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ బైక్ పై వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.మరో మూడు వారాల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా సినిమా ప్రమోషన్ల విషయంలో మరింత వేగం పెరగనుందని తెలుస్తోంది.
మూడు వారాల పాటు వరుస అప్ డేట్లతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఆర్ఆర్ఆర్ మేకర్స్ సర్ప్రైజ్ లు ఇవ్వనున్నారని సమాచారం.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా పైసా వసూల్ అనిపించేలా సినిమా ఉండనుందని తెలుస్తోంది.సినిమా రిలీజైన తర్వాత అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.