సినిమా రంగంలో సక్సెస్ కు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.ఎంత అందంగా కనిపించినా ఎవరి సపోర్ట్ ఉన్నా సరైన కథలను ఎంచుకుని ఆ సినిమాలతో విజయాలను అందుకుంటే మాత్రమే ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
కొంతమంది స్టార్ హీరోయిన్లు మాత్రం తమ సినీ కెరీర్ లో హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువగా ఉన్నా కెరీర్ ను కొనసాగిస్తూ కొత్త ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.
ఐశ్వర్యరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నా బాలీవుడ్ ఆఫర్లకు ఈ స్టార్ హీరోయిన్ పెద్ద పీట వేస్తుండటం గమనార్హం.ఐశ్వర్యారాయ్ ఇప్పటివరకు బాలీవుడ్ లో 31 సినిమాలలో నటించగా ఆ సినిమాలలో 4 మాత్రమే హిట్లు అని సమాచారం.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్ ఇప్పటివరకు 32 సినిమాలలో నటించగా 5 సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి.
మరో స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ హిందీలో 19 సినిమాలలో ఇప్పటివరకు నటించగా 6 సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించడం గమనార్హం.
కరీనా కపూర్ హిందీలో ఇప్పటివరకు 49 సినిమాలు చేయగా ఈ సినిమాలలో 13 సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటివరకు 41 సినిమాలలో నటించగా ఈ సినిమాలలో 10 మాత్రమే హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
![Telugu Aishwarya Rai, Bollywood, Kareena Kapoor, Priyanka Chopra-Movie Telugu Aishwarya Rai, Bollywood, Kareena Kapoor, Priyanka Chopra-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/05/Sonam-Kapoor-Aishwarya-Rai-Bollywood.jpg)
ఈ స్టార్ హీరోయిన్ల కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ హీరోయిన్లకు ఆఫర్లు అంతకంతకూ పెరిగాయి.ఈ స్టార్ హీరోయిన్లు తర్వాత సినిమాలతో ఎలాంటి రిజల్ట్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.ఈ బాలీవుడ్ హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.