కరోనా చికిత్సకు ఔషధాల గుర్తింపు: కృత్రిమ మేధస్సు‌తో భారత సంతతి శాస్త్రవేత్త ప్రయోగం

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు అన్ని దేశాల్లోనూ వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు జరుగుతున్నాయి.కొన్ని దేశాలు వాటిలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి.

 Indian-origin Scientist In America Uses Ai To Find Covid-19 Drug Candidates, Ame-TeluguStop.com

ఈ నేపథ్యంలో కోవిడ్‌ చికిత్సకు సహాయపడే వందల్లో ఉన్న ఔషధాలను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏ విధంగా పనిచేస్తుందనే దానిపై భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ప్రయోగాలు నిర్వహించింది.అమెరికాలోని రివర్‌సైడ్‌లో వున్న కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆనంద్ శంకర్ రే కరోనా చికిత్సలో సమర్థవంతంగా పనిచేసే ఔషధాలను గుర్తించాల్సి వుందన్నారు.

కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి రెమిడెసివర్ వంటి కొన్ని ఔషధాలు కొంతమేర ఉపయోగపడుతున్నాయని ఆనంద్ చెప్పారు.అయితే దీనికి అదనంగా మరిన్ని కొత్త ఔషధాల ఆవిష్కారానికి అవసరం ఏర్పడిందని ఆయన వెల్లడించారు.

ఈ ప్రయోగంలో భాగంగా మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశం, పునరుత్పత్తిలో ముఖ్యమైన ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకునే సామర్ధ్యమున్న ప్రస్తుత ఔషధాలను కరోనా చికిత్సకు మళ్లీంచే అవకాశాన్ని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది.కరోనా వైరస్ ప్రోటీన్లతో సంధానమయ్యే 65 మానవ ప్రోటీన్లపై వీరు దృష్టిసారించారు.

Telugu America, Anand Shankar, Calinia, Corona, Machine, Remdesivir-

ఒక్కో మానవ ప్రోటీన్ కోసం వేరు వేరు మెషిన్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేశారు.మానవ ప్రోటీన్లకు సంబంధించిన త్రీడి నమూనాల ఆధారంగా వాటిని నియంత్రించే ఔషధాలను గుర్తించేలా వీటికి శిక్షణ ఇచ్చారు.అనంతరం ప్రస్తుతం వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న మందులను ఈ నమూనాలతో స్క్రీన్ చేశారు.అనంతరం వీటిలో 65 మానవ ప్రోటీన్లకు సరిపడే ఔషధాలను గుర్తించారు.ఇవన్నీ ఆమోదం పొందినవేనని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.తమ నమూనా సాయంతో ఈ ఔషధాల విషతుల్యతను కూడా పరిశీలించామని తెలిపింది.

తద్వారా కరోనా చికిత్సకు పనికివచ్చే వీలున్న వందలాది ఔషధాలను గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.వీరి డ్రగ్ డిస్కవరీ పైప్‌లైన్‌కు సంబంధించిన పరిశోధనల వివరాలను హెలియోన్ జర్నల్‌లో ప్రచురించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube