ఈ రోజుల్లో అంతా సోషల్ మీడియాకు అతుక్కు పోతున్నారు.ఖాళీ సమయాల్లో చూడడం మాట అటుంచితే ఖాళీ చేసుకుని మరీ వీడియోలు చూసేస్తున్నారు.
కొందరైతే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేస్తూ లైక్‌లు, షేర్లు, కామెంట్ల కోసం ఆరాట పడుతుంటారు.వీటి ద్వారా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అవుతుంటారు.
దీంతో పాటు ఆదాయమూ వస్తుండడంతో నిత్యం వాటితోనే తమ జీవితం అన్నట్లు గడిపేస్తున్నారు.కొన్ని వీడియోలు చేస్తున్న క్రమంలో వారికి ఎదురయ్యే అనుభవాలు చాలా ఫన్నీగా ఉంటాయి.
ఇలా ఓ అమ్మాయి రీల్స్ చేస్తున్న క్రమంలో ఊహించని అనుభవం ఎదురైంది.దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఓ అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది.
వచ్చీపోయే వాహనాలతో ఆ రోడ్డు అంతా రద్దీగా ఉంటుంది.ఆ వీడియో తీసే ఆమె సన్నిహితుడు వెనుక నుంచి వచ్చి ఆమె భుజం మీద తడతాడు.
వెంటనే చేయందిస్తాడు.అతడి చేయి పట్టుకుని ఆ అమ్మాయి సంతోషంతో ఉప్పొంగి పోతుంది.
అతడి వంక చూస్తున్న ముందుకు చేయిపట్టకుని పరుగెత్తాలనుకుంటుంది.అక్కడ వరకు అంతా అనుకున్నట్లే అయింది.
అప్పుడు పరుగెడుతున్న క్రమంలో అక్కడ ఉన్న స్తంభాన్ని ఆ అమ్మాయి చూసుకోలేదు.స్పీడ్‌గా వెళ్లే క్రమంలో ఆ స్తంభానికి ఆమె తల గుద్దుకుంది.
దీంతో ఏదో చేస్తే ఇంకేదో అయింది అనుకుంటూ బాధగా ముఖం పెట్టింది.నెట్టింట్లో ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.