దుబాయ్‌లో హైదరాబాదీ పిచ్చిచేష్టలు: సోషల్ మీడియాలో విద్వేష పోస్ట్.. ఉద్యోగం పీకిన కంపెనీ

దేశం కానీ దేశంలో ఉన్నప్పుడు వొళ్లు దగ్గర పెట్టుకుని వుండాలి.అలా కాకుండా వెదవ వేషాలు వేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

 Hyderabadi In Dubai, Firm, Alleged Hate Speech In Facebook Post, Facebook, Socia-TeluguStop.com

మామూలుగానే వివిధ నేరాలకు అరబ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయి.వాటిని చూసి మరో వ్యక్తి నేరం చేయాలంటనే వెన్నులో వణుకు పుడుతుంది.

అన్నీ తెలిసి కూడా ఓ తెలుగు ఎన్ఆర్ఐ దుబాయ్‌లో సోషల్ మీడియాలో విద్వేష పోస్ట్ పెట్టడంతో ఉద్యోగం పొగొట్టుకున్నాడు.హైదరాబాద్‌ నగరానికి చెందిన నక్కా బాలకృష్ణ… దుబాయ్‌లోని మోరో హబ్ సొల్యూషన్స్‌లో చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో మతాలు, జాతులపై విద్వేషం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Telugu Allegedhate, Dubai, Firm-

ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సదరు కంపెనీని డిమాండ్ చేశారు.దీనిపై స్పందించిన ఆ సంస్థ బాలకృష్ణను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.తమ ఉద్యోగులు ఎవరైనా ఇతరుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఆ కంపెనీ స్పష్టం చేసింది.యూఏఈలో ఇతర మతాలు, జాతులపై వివక్ష చూపించడం నేరం.2015లోనే ఇందుకు సంబంధించిన కఠిన చట్టాలను అక్కడి ప్రభుత్వం రూపొందించింది.ఇప్పటికే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన పలువురు భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.ఎమ్రిల్ సర్వీస్‌లో టీమ్ లీడర్‌గా పనిచేసిన రాకేశ్ బీ కిట్టుర్మత్, మితేష్ ఉదేశీలను ఇలాంటి ఆరోపణలపైనే ఆయా కంపెనీలు ఉద్యోగాల నుంచి తీసేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube