టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నజీమ్ అంటే సుందరానికి సినిమాతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.నజ్రియా ఫేస్ లో గ్లో తగ్గిందని ఆమె యాక్టింగ్ ఇంప్రెసివ్ గా లేదని ఈ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
డబ్బింగ్ మూవీ రాజారాణి ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నజ్రియా పలు మలయాళ సినిమాల ద్వారా విజయాలను అందుకున్నారు.
కేరళలోని త్రివేండ్రంలో నజ్రియా జన్మించారు.
కేరళలో నజ్రియా బీకాం వరకు చదివారు.పలంకు అనే మలయాళ సినిమాతో నటిగా నజ్రియా సినీ కెరీర్ మొదలైంది.
మాడ్ డాడ్ అనే సినిమాతో హీరోయిన్ గా నజ్రియా ప్రస్థానం మొదలైంది.మలయాళంలో క్లాసిస్ గా నిలిచిన బెంగళూరు డేస్ సక్సెస్ నజ్రియా క్రేజ్ ను మరింత పెంచింది.
ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఫహద్ ఫాజిల్ తో నజ్రియాకు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం ప్రేమగా మారగా పెద్దలను ఒప్పించి నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ వివాహం చేసుకున్నారు.25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానని ఫహద్ నా లైఫ్ లోకి అద్భుతంలా వచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు.ఫహద్ ఫాజిల్ మెథడ్ యాక్టర్ అని ఒక పాత్ర చేస్తుంటే ఆ పాత్రలో లీనమైపోతాడని ఆమె అన్నారు.
పెళ్లైన తర్వాత మెథడ్ యాక్టింగ్ మానుకోవాలని ఇంటికొచ్చిన సమయంలో భర్తగా ఉంటే చాలని వార్నింగ్ ఇచ్చానని నజ్రియా కామెంట్లు చేశారు.
![Telugu Fahad Fazil, Kollywood, Nazriya Nazim, Tollywood-Movie Telugu Fahad Fazil, Kollywood, Nazriya Nazim, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/06/nazriya-nazim-fahad-fazil.jpg )
నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు.నాని స్టోరీ సెలక్షన్ బాగుంటుందని నానికి నచ్చితే కచ్చితంగా మంచి స్టోరీ అని తనకు కాన్ఫిడెన్స్ అని ఆమె కామెంట్లు చేశారు.కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నజ్రియా నజీమ్ అన్నారు.
దివ్య అనే ట్యూటర్ సహాయంతో నజ్రియా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు.