హీరోయిన్ అంజలి పాటిల్ గురించి మనందరికీ తెలిసిందే.అంజలి పాటిల్ పేరు వినగానే అందరికీ నా బంగారు తల్లి సినిమా గుర్తుకువస్తుంది.
ఆ సినిమాలో అంజలి పాటిల్ అద్భుతంగా నటించింది అన్న విషయం తెలిసిందే.అంజలి నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలకు చిరునామా అని చెప్పవచ్చు.
ఒకవైపు వెండితెరపై, మరొకవైపు వెబ్ స్క్రీన్ రెండింటిలో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.ఇప్పుడు అంజలి కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
అంజలి మహారాష్ట్రలోని నాసిక్ లో పుట్టి పెరిగింది.
ఆ తర్వాత పూణే యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ అందుకుంది.
అలా ఆ తర్వాత నటనపై ఆమెకు ఉన్న మక్కువతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ విధంగా ఆమెకు మొదటగా డెల్హ్ ఇన్ ఏ డే సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొదటి సినిమా తరువాత కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం మాత్రం ప్రకాశ్ ఝా చక్రవ్యూహ్. ఆ సినిమాలో అంజలి ఆమె మావోయిస్ట్ నేత జుహూగా నటించింది.
అయితే ఆ సినిమా తర్వాత వరుసగా అన్నీ అలాంటి పాత్రలే రావడంతో అన్నిటినీ తిరస్కరించింది.
ఎన్నెస్‌డీలో ఉన్నప్పుడే అంజలి నటనా కౌశలం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.తొలి సినిమా అవకాశం కూడా విదేశాల నుంచే వచ్చింది.అది శ్రీలంకన్ చిత్రం.
విత్ యూ.వితవుట్ యూ అన్నట్టు అంజలి బౌద్ధమతాన్ని పాటిస్తుంది.అయితే అంజలి కేవలం నటి మాత్రమె కాదు.నిర్మాత కూడా.సినిమా తెర మీదే కాదు మై డియర్ ప్రైమ్ మినిస్టర్, మై క్లయింట్ వైఫ్,మేరీ నిమ్మో, కౌన్ ప్రవీణ్ తాంబె వంటి వెబ్ మూవీస్‌లోనూ తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది.అంజలి కి పుస్తకాలు, ప్రయాణాలంటే ఇష్టం.