సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలలో నటిస్తే వారిద్దరి గురించి ఎన్నో వార్తలు షికార్లు చేస్తుంటాయి.ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం మనం చూసే ఉన్నాం.
ఈ క్రమంలోనే నటుడు సందీప్ కిషన్ రెజీనా కూడా కలిసి నాలుగు సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.
ఇక ఈ వార్తలకు అనుగుణంగానే నటుడు సందీప్ కిషన్ రెజీనా పుట్టినరోజు సందర్భంగా తనతో చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడమే కాకుండా హ్యాపీ బర్త్ పాప.ఐ లవ్ యు నీకు ఎప్పుడు మంచే జరగాలి అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే సందీప్ కిషన్ రెజినాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇలా తనకు విషెస్ తెలపడంతో కోలీవుడ్ మీడియం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలను సృష్టించారు.ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.అయితే తాజాగా నటుడు సందీప్ కిషన్ మైకేల్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన రెజినాతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.
నేను రెజినా నాలుగు సినిమాలలో కలిసి నటించాము.తను నా బెస్ట్ ఫ్రెండ్.తను మా ఫ్యామిలీ మెంబర్ లాగా.గత 12 సంవత్సరాల నుంచి మేము ఒకరికొకరం బాగా తెలుసు తను పని నిమిత్తం బాంబే వచ్చిన ప్రతిసారి తన సోదరీ వద్దే ఉంటుందని సందీప్ కిషన్ తెలిపారు.
మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఈయన తెలిపారు.అయితే మేమిద్దరం స్నేహితులు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు.వీళ్ళ మధ్య ఏదో ఉందంటేనే సర్ప్రైజ్ అవుతారు.అయితే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ తెలియక కోలీవుడ్ మీడియా మా గురించి అలాంటి వార్తలు రాశారు అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ రెజినాతో తనకున్న రిలేషన్ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చేశారు.