మామూలుగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే మెడలో తాళిబొట్టు తీసి పక్కకు పెడతారు.వాళ్లకు మంగళసూత్రం, కట్టు బొట్టు పై అంతగా ఆసక్తి ఉండదు.
పైగా వాటిని ధరించాలన్న ఇష్టాన్ని కూడా చూపించరు.అందుకే కాబోలు వారి జీవితాలు తొందరగా నాశనం అవుతూ ఉంటాయి.
కొన్ని శాస్త్రాల ప్రకారం మెడలో తాళిబొట్టు ఎప్పటికీ తీయొద్దు తీస్తే కొన్ని పరిణామాలు ఎదురవుతాయి అని అంటుంటారు.కానీ మన హీరోయిన్లు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోరు.
ఏదో సందర్భం బట్టి కొన్ని కొన్ని సార్లు బొట్టు పెట్టుకుని మెడలో తాళిబొట్టు వేసుకొని కనిపిస్తారు.అయితే తాజాగా హన్సిక ( Hansika ) కూడా ఇన్ని రోజులకు పెళ్లయిన అమ్మాయిలా దర్శనం ఇచ్చింది.
ఇంతకు తను అలా రెడీ కావడానికి ఒక కారణం ఉంది.ఇంతకు అదేంటంటే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హన్సిక.అప్పట్లో తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులు దోచుకుంది.నటనతో కూడా ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.
ఇక 2001లో సినీ ఇండస్ట్రీకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించింది హన్సిక. బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది.
![Telugu Hansika, Hansika Homely, Hansika Motwani, Hansika Offers-Movie Telugu Hansika, Hansika Homely, Hansika Motwani, Hansika Offers-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/03/hansika-looking-gorgeous-in-homely-look-after-marriage-pics-viral-detailsa.jpg)
2007లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో( Desamuduru ) హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ లతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.ఈమె వ్యక్తిగతం పట్ల మంచి పేరు సంపాదించుకుంది.
చాలా వరకు ఎంతో మంది అనాధలకు కడుపు నింపింది.
![Telugu Hansika, Hansika Homely, Hansika Motwani, Hansika Offers-Movie Telugu Hansika, Hansika Homely, Hansika Motwani, Hansika Offers-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/03/hansika-looking-gorgeous-in-homely-look-after-marriage-pics-viral-detailsd.jpg)
కొంతమంది అనాధ పిల్లలను కూడా దత్తత తీసుకుంది.అలా ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇక గత ఏడాది ఈ బ్యూటీ లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
తన ఫ్రెండ్ మాజీ భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ సమయంలో తను చాలా నెగటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంది.
అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.
![Telugu Hansika, Hansika Homely, Hansika Motwani, Hansika Offers-Movie Telugu Hansika, Hansika Homely, Hansika Motwani, Hansika Offers-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/03/hansika-looking-gorgeous-in-homely-look-after-marriage-pics-viral-detailssa.jpg)
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.ఇక పెళ్లి అయినప్పటినుంచి తన భర్తతో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇక పెళ్లయ్యాక కూడా భర్త సపోర్ట్ తో బాగా గ్లామర్ షో చేస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతూ రచ్చ చేస్తుంది.ఇక పెళ్లయి ఎన్ని రోజులైనా కూడా ఒక్కసారి కూడా పద్ధతిగా కనిపించలేదు హన్సిక.
దీంతో మధ్య మధ్యలో ఈమెకు బాగా నెగిటివ్ కామెంట్ కూడా వచ్చాయి.పెళ్లయిన ఆడదానిలా ప్రవర్తించు అంటూ చాలామంది కామెంట్లు చేశారు.అయితే ఇదంతా పక్కన పెడితే తమ సాంప్రదాయం ప్రకారం ఈ అష్టమి రోజు( Asthami ) ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు.అయితే ఈ సందర్భంగా ఆమె ఈరోజు కొన్ని రకాల ఆహార పదార్థాలు అక్కడున్న పిల్లలకు తినిపిస్తున్నట్లు కనిపించింది.
అయితే ఆ వీడియోను పంచుకోగా అందులో తను పాప్పిట్లో బొట్టు పెట్టుకొని, మెడలో నల్లపూసలు ధరించి చాలా పద్ధతిగా కనిపించింది.ఇక ఆ వీడియో చూసి ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా చాలా బాగున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.