యూపీలోని గోరఖ్‌పూర్ గోరఖ్‌నాథ్ ఆలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందింనని అనుకుంటున్నారా? ఇక్కడ అనేక ప్రత్యేకతలున్నాయి.పలితంగా గోరఖ్ పూర్ ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది.
గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్ కూడా ఉంది.దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
గోరఖ్‌పూర్ లోని రైల్వే స్టేషన్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని మీకు తెలుసా?.ఎందుకంటే గోరఖ్‌పూర్ జంక్షన్ ప్రపంచంలోనే అతి పొడవైన స్టేషన్ ప్లాట్‌ఫారమ్.
ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు.కానీ ఇది నిజం.ఈ ప్లాట్‌ఫారమ్ 2013లో ప్రారంభించారు.ఈ ప్లాట్‌ఫారమ్ మొత్తం పొడవు 1,366.33 మీటర్లు. ఈ జంక్షన్ ఈశాన్య రైల్వే పరిధిలోకి వస్తుంది.
ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.గోరఖ్‌పూర్ కంటే ముందు ఈ రికార్డు పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్ పేరిట ఉండేది.ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ పొడవు 1072.5 మీటర్లు.సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్ SE రైల్వే డివిజనల్ ప్రధాన కార్యాలయం.
![Telugu Geeta Press, Gorakhpur, Hubbalirailway, Uttarpradesh, Longest Platm-Gener Telugu Geeta Press, Gorakhpur, Hubbalirailway, Uttarpradesh, Longest Platm-Gener](https://telugustop.com/wp-content/uploads/2022/04/gorakhnath-Mandir-World-longest-platform-at-Gorakhpur-railway-station-Know-About-It-detailss.jpg )
హుబ్లీ జంక్షన్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించనున్నారు.గోరఖ్‌పూర్ కిరీటాన్ని కొల్లగొట్టే విధంగా కర్ణాటకలోని హుబ్లీ జంక్షన్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు.నివేదిక ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌ను 1550 మీటర్ల పొడవు ఉండే విధంగా విస్తరిస్తున్నారు.
రాబోయే కాలంలో హుబ్లీ జంక్షన్ ప్లాట్‌ఫారమ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్‌గా మారనుంది.